నిన్న గ్యాస్.. ఇవాళ పెట్రోల్.. రేపేంటి.?
MDK: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో జిల్లా ప్రజల నిత్యావసరాల పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతోంది. మొన్నటి వరకు గ్యాస్ కొరత ఉండగా, ఇప్పుడు పెట్రోల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్ముందు ఇంకే కొరతలు వస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, జిల్లాలో ఎటువంటి కొరత లేదని అధికారులు చెబుతున్న విషయం తెలిసిందే.