డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు

డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 1న ప్రారంభమై 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు మొత్తం 19 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశారు. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.