‘సైన్యం, నాయకత్వం లేకుండా చేశాం’
శత్రుదేశ(ఇరాన్) సైనిక సామర్థ్యం ఇప్పుడు శూన్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థలు కూడా పని చేయడం లేదని, నాయకత్వమే లేకుండా చేశామన్నారు. తాము నిర్ణయించుకున్న గడువులోగా పని ముగించి తిరిగి వచ్చేస్తామని, ఇకపై అక్కడ ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇకపై ప్రపంచ వాణిజ్యం సాఫీగా సాగుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.