పెద్దపల్లి MLA.. రాజీనామా చేయ్: కౌశిక్ రెడ్డి
PDPL: తనుగుల చెక్ డ్యాం కుంగిన ఘటనలో కాంగ్రెస్, BRSల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. బ్లాస్టింగ్ జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని పెద్దపల్లి MLA విజయ రమణారావు హరీశ్ రావుకు సవాల్ విసిరిన నేపథ్యంలో ఆయన తరఫున ఛాలెంజ్‌ను స్వీకరించినట్లు హుజురాబాద్ MLA కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా డ్యాం దగ్గర బ్లాస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన వైర్లు, రంధ్రాలను వీడియోలో చూపించారు. ఇప్పుడు రాజీనామా చేయ్ రమణారావు అని డిమాండ్ చేశారు.