సోమారం పాఠశాలలో ప్యానల్ ఇన్స్‌పెక్షన్
WGL: పర్వతగిరి మండలంలోని సోమారం ప్రాథమికోన్నత పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానల్ ఇన్స్‌పెక్షన్ బృందం గురువారం తనిఖీ చేసింది. పాఠశాలల పనితీరు, అభివృద్ధిపై సమగ్రంగా పరిశీలన చేపట్టినట్లు నోడల్ ఆఫీసర్ గుండు రవి తెలిపారు. పరిశుభ్రత, మిడ్‌డే మీల్, బోధన విధానాలు, రిజిస్టర్లు, ఉపాధ్యాయుల హాజరు వరకు అన్ని అంశాలను పరిశీలించారు.