జూ పార్క్ టన్నెల్ అక్వేరియం.. నిర్వహణకు సవాలు.!

జూ పార్క్ టన్నెల్ అక్వేరియం.. నిర్వహణకు సవాలు.!

HYD: జూపార్కులో అండర్ వాటర్ అక్వేరియం పనులు ముగింపు దశకు వచ్చాయి. విదేశీ చేపల సంరక్షణ, విద్యుత్ ఖర్చుల దృష్ట్యా టికెట్ ధరను రూ. 500 వరకు నిర్ణయించే ప్రతిపాదన పర్యాటక శాఖలో చర్చనీయాంశమైంది. నిర్వహణ భారాన్ని సామాన్యుడిపై మోపడం "ప్రజా పర్యాటకం" లక్ష్యానికే విఘాతం కలిగించేలా ఉంది. కాంట్రాక్ట్ సంస్థల లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.