ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
ASR: టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ సుబ్బారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. నందమూరి తారక రామారావు పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించాలనే లక్ష్యంతో పార్టీని స్థాపించారని సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.