'వర్షాలకు పంటలలో యాజమాన్య పద్దతులను పాటించండి'

KRNL: అధిక వర్షాల పరిస్థితుల్లో వివిధ పంటలలో యాజమాన్య పద్ధతులను పాటించాలని ఏవో సుచరిత బుధవారం తెలిపారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినట్లయితే వివిధ దశల్లో ఉన్న పంటలు అక్కడక్కడా పాక్షికంగా ముంపుకు గురి అయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీని వలన బరువైన నల్లరేగడి నేలల్లో సాగు చేసే పత్తి, కంది, జొన్న, చెరుకు, వేరుశనగ పంటల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.