VIDEO: తప్పిన పెను ప్రమాదం.. రోడ్డు పైకి జారిపడిన రాతిబండ

RR: మంచిరేవుల రహదారిలో పెను ప్రమాదం తప్పింది. మంచిరేవుల సర్వీస్ రోడ్‌పై భారీ రాతి బండ జారి రోడ్డుపై పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో దూరాన ఉన్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనివల్ల భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రంగంలోకి దిగిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు.