మద్యం షాపుల్లో ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు
ELR: చింతలపూడి మండలం చింతలపూడి, ప్రగడవరం గ్రామాలలోని లైసెన్స్ కలిగిన మద్యం దుకాణాలను ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. సంబంధిత షాపు యజమానులకు ఎక్సైజ్ శాఖ నియమావళి ప్రకారం వ్యాపారం నిర్వహించాలని, అన్ని మద్యం సీసాలను 'ఏపీ ఎక్సైజ్ సురక్షా' యాప్ ద్వారా స్కాన్ చేయాలని చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్ సూచనలు చేశారు.