'ఆస్తులపై అవగాహన కల్పించాలి'
KNR: దీర్ఘకాలంగా క్లెయిమ్ చేయని ఆస్తులు (బ్యాంకు డిపాజిట్లు, బీమా, పీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు)ను క్లెయిమ్ చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకు, భీమా, ఆర్థిక సంస్థల ప్రతినిధులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో బ్యాంకు, బీమా, నియంత్రణ సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.