'మలిదశ ఉద్యమకారుల పాదయాత్రను జయప్రదం చేయండి'

SRPT: అర్వపల్లిలో ఈనెల15న ప్రారంభమయ్యే మలిదశ ఉద్యమకారుల పాదయాత్రను జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు కృష్ణమూర్తి అన్నారు. గురువారం జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో పాదయాత్ర కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలని, కొట్లాడిన సాధించిన తెలంగాణలో ఉద్యమకారులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.