సౌత్‌జోన్ వాలీబాల్ టోర్నమెంట్‌కి ఎంపిక

సౌత్‌జోన్ వాలీబాల్ టోర్నమెంట్‌కి ఎంపిక

ELR: ఇటీవల ఆదికవి నన్నయ యూనివర్సిటీ నిర్వహించిన అంతర కళాశాల వాలీబాల్ పోటీలలో బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి జయశ్రీ సౌత్‌జోన్ పోటీలకు ఎంపికైంది. డిసెంబర్‌లో చెన్నైలో నిర్వహించే జాతీయ పోటీలకు జయశ్రీ ఎంపిక అవ్వడం చాలా సంతోషించదగ్గ విషయమని ప్రిన్సిపల్ డాక్టర్ మానేంద్ర రావు అన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు ఆమెకు అభినందనలు తెలియజేశారు.