విశాఖ పోర్టు సరికొత్త రికార్డు
VSP: విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) సరుకు రవాణాలో కొత్త రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 213 రోజుల్లోనే 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా పూర్తి చేసింది. గత ఏడాది కంటే తక్కువ సమయంలోనే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. పోర్టు ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ డా. అంగముత్తు ఈ విషయాన్ని ఆదివారం తెలిపారు.