నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ
విజయనగరంలో చలి తీవ్రత దృష్ట్యా ఓ స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి దుప్పట్లు పంపిణి చేసారు. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపకులు KSN మూర్తి మాట్లాడుతూ.. దట్టంగా కురుస్తున్న మంచుకు రోడ్లుపై నిద్రిస్తున్న కొంతమంది నిరాశ్రయులు ఇబ్బందులు పడకుండా తమ వంతు బాధ్యతగా సంస్థ సభ్యులతో కలసి దుప్పట్లు పంపిణి చేశామన్నారు.