అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు ఇస్తాం: ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ మండలంలోని సుద్ద గూడ గ్రామంలో 39 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.