మూడో రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె

మూడో రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె

SDPT: హుస్నాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకూ కొనసాగుతోంది. డిపో ఎదుట ధర్నా నిర్వహిస్తున్న కార్మికులు బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తున్నారు. సమ్మె ప్రభావంతో బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు జోక్యం చేసుకుని సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు.