పిల్లలకు ఇక నుంచి టిఫిన్..!
HYD: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల 3,253 కేంద్రాల్లో చిన్నారుల కోసం ఉదయం అల్పాహార పథకం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1.50 లక్షల మంది చిన్నారులు లబ్ధి పొందనున్నారు. పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారంలో మెరుగుదలతో పాటు పాఠశాల హాజరును పెంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. మెనూలో ఇడ్లీ, ఉప్మా, రాగి జావ, అటుకుల ఉప్మా వంటి వంటకాలు ఉండనున్నాయి.