పగడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

మన్యం: జిల్లాలో ఈ నెల 12- 20వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత సంబంధిత అధికారులను కోరారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారి డి.మంజులవీణతో కలసి సమావేశం నిర్వహించారు.