రేపు కదిరిలో ప్రజా దర్బార్‌లో పాల్గొననున్న ఎమ్మెల్యే
SS: కదిరి మండలంలోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ ప్రాంగణంలో రేపు ఉదయం 10 గంటలకు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది గురువారం తెలిపారు. కదిరిలోని 4,5,6,7,8,31 వార్డుల సమస్యలు తెలుసుకోవడానికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఈ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఎమ్మెల్యేకు సమస్యలు తెలపాలన్నారు.