'పెద్ది' సెట్స్‌లో 'రాకాస' సందడి

'పెద్ది' సెట్స్‌లో 'రాకాస' సందడి

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై నిర్మిస్తున్న క్రేజీ ఫాంటసీ ఎంటర్‌టైనర్ మూవీ 'రాకాస'. ఏప్రిల్ 3న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను 'పెద్ది' సెట్స్‌లో కలిశారు. ఈ సందర్భంగా 'రాకాస' గ్లింప్స్, సాంగ్స్ చూసిన రామ్ చరణ్ టీమ్ అందరినీ అభినందించారు.