'ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోండి'
SRPT: దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందించే సహాయ ఉపకరణాలకు అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి నరసింహరావు కోరారు. ల్యాప్‌టాప్‌లు, బ్యాటరీ వీల్ ఛైర్లు తదితర పరికరాల కోసం ఆన్‌లైన్ ద్వారా ఈనెల 30లోగా దరఖాస్తు చేయాలన్నారు. పూర్తి వివరాలకు కలెక్టరేట్‌లోని జీ-1 గదిలో సంప్రదించాలన్నారు.