గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా

గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా

గుంటూరు కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు శుక్రవారం ధర్నా చేశారు. వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల ప్రకారం సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం‌ను కోరారు. టీఏ, డీఏలను కూడా ఇవ్వాలని యూనియన్ నాయకులు పేర్కొన్నారు.