అంబేడ్కర్ యువజన సంఘం గ్రామ కన్వీనర్ వినీత్

KNR: శంకరపట్నం మండలం కేశవపట్నంలో తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం గ్రామ కన్వీనర్గా బొజ్జ వినీత్ కుమార్‌ను కో-కన్వీనర్ గా మేకల కుమారు నియమించినట్లు మండలాధ్యక్షుడు అంతడుపుల సతీష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొజ్జ రవి, సంఘం సీనియర్ నాయకులు దేవునూరి కిష్టయ్య, కనకం శంకర్, మండల ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి ఓదెలు పాల్గొన్నారు.