VIDEO: పత్తికొండలో భక్తుల పాదయాత్ర

KRNL: శ్రావణ మాసం ప్రారంభంకానున్న వేళ ఉరుకుంద ఈరన్న క్షేత్రంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. పత్తికొండ పట్టణానికి చెందిన సుమారు 300 మంది భక్తులు మంగళవారం ఉదయం 7 గంటలకు తేరుబజార్ నుంచి పాదయాత్రగా బయలుదేరారు. భక్తులను వారి బంధుమిత్రులు మేళతాళాలతో, గొరువయ్యల నృత్యాలతో ఘనంగా సాగనంపారు.