డీఎంకే తీరుపై ప్రధాని తీవ్ర ఆగ్రహం
తమిళనాడులోని మధురైలో జరిగిన సభలో PM మోదీ డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పీఎం ఆవాస్ యోజన కింద రాష్ట్రంలో 6 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, కానీ డీఎంకే సర్కార్ సర్వేలు నిర్వహించకపోవడం వల్ల మరో 3 లక్షల ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే స్వార్థ రాజకీయాల వల్ల పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఆ పార్టీ పేదల కోసం పనిచేయదని మోదీ దుయ్యబట్టారు.