ద్రాక్ష పండ్ల ప్రత్యేక అలంకరణలో స్వయంభుజంబుకేశ్వరుడు

ద్రాక్ష పండ్ల ప్రత్యేక అలంకరణలో స్వయంభుజంబుకేశ్వరుడు

ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభుజంబుకేశ్వరుడు ప్రత్యేక అలంకరణలో సోమవారం భక్తులకు దర్శనం ఇచ్చాడు. శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా పురోహితులు రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి మూలవిరాట్ పై ద్రాక్ష పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్వామి వారి విశేష అలంకరణను భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.