ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్
SDPT: సిద్దిపేట జిల్లాలో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించారు.