బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
PDPL: సుల్తానాబాద్ మండలం కనుకుల–రేగడి మద్దికుంట రోడ్ చౌరస్తా వద్ద బైక్ అదుపుతప్పి రఘురాం (18) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. అతివేగం కారణంగా కనుకుల క్రాసింగ్‌లో బైక్ స్కిడ్ కావడంతో ముక్కు, తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో ఉంచారు.