VIDEO: ప్రారంభమైన 'సారథ్యం' సభ

VSP: నగరంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'సారథ్యం' బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టేబుల్ బుక్‌ను నడ్డా విడుదల చేశారు. అనంతరం నడ్డాను గజమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ప్రజలు అధిక సంఖ్యలో సభకు తరలివచ్చారు.