పాత్రికేయుల మిత్రులకు ఉచిత వైద్య శిబిరం
PPM: జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కుటుంబసభ్యులకు జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డా.ప్రభాకర రెడ్డి బుధవారం తెలిపారు. వివిధ మాధ్యమల ద్వారా అహర్నిశలు పనిచేస్తూ, ప్రజలకు సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పాత్రికేయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు.