పాము కాటుకు గురైన మహిళ మృతి
VZM: గంట్యాడ మండలంలోని దిగువ కొండపర్తి గ్రామంలో ఎర్ర బోయిన కొత్తమ్మ (40) అనే వివాహితను ఓ పాము కాటు వేయడంతో తను నివసిస్తున్న పూరిల్లులో మృతి చెందినట్లు గంట్యాడ ఎస్సై సాయి కృష్ణ శుక్రవారం తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.