కొత్తగూడలో వసూళ్ల పర్వం.. స్పందించని పోలీసులు
MHBD: ఫారెన్‌లో లక్షలు పెడితే కోట్లు సొంతం అవుతాయని ఆశ చూపి అమాయక ఆదివాసీలను మోసగించి కోట్ల రూపాయలు కాజేస్తున్న ముఠా గురించి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగూడను కేంద్రంగా చేసుకుని వసూళ్ల పర్వం సాగుతోందని, పోలీసులు నిద్రమత్తులో ఉన్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘరానా మోసంపై ప్రత్యేక దృష్టి సారించి న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.