నిరుద్యోగ మహిళలకు మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ

నిరుద్యోగ మహిళలకు మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ

NLG: నల్గొండ శివారు రాంనగర్‌లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు మగ్గం వర్క్‌లో 31రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణలో ఉచిత టూల్ కిట్, వసతి,భోజనం కల్పిస్తామన్నారు. 18 సం.నుంచి 45 లోపు ఉమ్మడి NLGకు చెందిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు నవంబర్ 3 లోపు అప్లై చేసుకోవాలన్నారు.