'అన్న క్యాంటీన్లపై ప్రజలు పూర్తిస్థాయి సంతృప్తి చెందాలి'

'అన్న క్యాంటీన్లపై ప్రజలు పూర్తిస్థాయి సంతృప్తి చెందాలి'

కర్నూలు నగరంలోని ఐదు అన్న క్యాంటిన్ల నిర్వహణపై ప్రజలు పూర్తి స్థాయి సంతృప్తి చెందాలని, వాటి సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. మంగళవారం ఆయన పాత బస్టాండ్‌లోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించి, ప్రజలకు అందించే భోజనం నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై ఆరా తీశారు.