శ్రీకాకుళం జిల్లాకు రెయిన్ అలెర్ట్

శ్రీకాకుళం జిల్లాకు రెయిన్ అలెర్ట్

శ్రీకాకుళం జిల్లాలో నేడు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. మరోవైపు గురువారం 16 మండలాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పిడుగులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, పొలాల్లో ఉండరాదని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.