VIDEO: బస్సు ప్రమాదం.. 14కి చేరిన మృతుల సంఖ్య
మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు-ట్రిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో మృతులు సంఖ్య 14కి చేరిందని అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలికి చేరుకున్న మంత్రులు, ఇతర అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.