టీటీడీలో జరిగిన అక్రమాలపై కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు
తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ TTDలో జరిగిన అక్రమాలపై సంచలన ఆరోపణలు చేశారు. నెయ్యి కల్తీ కుట్ర వెనుక ఒక మత సంస్థ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. మాజీ EO ధర్మారెడ్డికి కొందరు భజన చేస్తున్నారని ex.TTD ఛైర్మన్ సుబ్బారెడ్డి విచారణకు రావాలంటేనే భయపడుతున్నారని విమర్శించారు. అయితే 2 రోజుల్లో సిట్ బృందానికి కీలక విషయాలను సీల్డ్ కవర్‌లో CBI, సిట్ అధికారులకు అందజేస్తామన్నారు