కస్తూర్భా స్కూల్‌కు సీసీ రోడ్డు నిర్మించాలని వినతి

NDL: పాములపాడులోని కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయం, ఏపీ మోడల్ స్కూల్ కళాశాలలకు మిట్టకందాల రోడ్డు నుంచి సీసీ రోడ్డు నిర్మించాలని కోరుతూ డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు MLA జయసూర్యకు వినతిపత్రం అందజేశారు. మిట్ట కందాల గ్రామం నుంచి స్కూల్ దారి అధ్వారంగా ఉందని ఆయన తెలిపారు. త్వరగా రోడ్డు వేస్తే పిల్లలతో పాటు, స్థానికులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.