అనాధ వృద్ధుడిని ఆశ్రమానికి తరలింపు
MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని బస్టాండులో ఉంటున్న వృద్ధున్ని స్థానిక పోలీసులు అనాధాశ్రమానికి తరలించారు. రషీద్ ఖాన్ అనే అనాధ వృద్ధుడు నిస్సహాయ స్థితిలో కొంతకాలంగా బస్టాండులో ఉంటున్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్సై అన్వర్ అక్కడికి చేరుకొని మంచిర్యాలలోని కల్వరి అనాధ ఆశ్రమ నిర్వాహకులు కుమార్‌కు సమాచారం ఇచ్చి అప్పగించారు.