'ఫ్రైడే డ్రైడేతో రోగాలకు చెక్ పెట్టవచ్చు'
PPM: ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రైడే కార్యక్రమంతో రోగాలకు చెక్ పెట్టవచ్చునని కొమరాడ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ రమేష్ అన్నారు. శుక్రవారం గుణదతీలేసు గ్రామ పంచాయతీ పరిధిలో గల బిన్నిడి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఇంటి వద్ద గాని గ్రామంలో గాని నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు