తిరుమల శ్రీవారి సేవలో నైనా జైస్వాల్
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆదివారం ఉదయం విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆమెకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆశీస్సులతో దేశానికి మరిన్ని పతకాలు తీసుకురావాలని కోరుకున్నట్లు తెలిపింది.