PDSU 23వ రాష్ట్ర మహాసభ పోస్టర్ల ఆవిష్కరణ
WGL: నర్సంపేట పట్టణలో ఇవాళ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (PDSU) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అజయ్, స్థానిక నేతలతో కలిసి PDSU 23వ రాష్ట్ర మహాసభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా కేంద్రంలో డిసెంబర్ 10 నుంచి 12 వరకు సభలు నిర్వహిస్తామని, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.