LPG సంక్షోభం.. కేంద్రానికి వ్యతిరేకంగా మమతా ర్యాలీ
దేశవ్యాప్తంగా LPG గ్యాస్ కొరతను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున తమ పార్టీ టీఎంసీ కార్యకర్తలతో కోల్‌కతాలో రోడ్లపై వచ్చి ర్యాలీని నిర్వహించారు. ముందు మమతా నడుస్తుండగా.. ఆమె వెనక వేలాది మంది కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.