టోల్‌ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం

టోల్‌ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం

VSP: ఆనందపురం మండల పరిధిలోని దుక్కవానిపాలెం టోల్‌ ప్లాజా వద్ద ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. టోల్‌ కోసం వెయింటింగ్‌లో ఉన్న రెండు కార్లను లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి వాహనాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.