TSCA రాష్ట్ర గవర్నర్ మెంబర్‌గా సీనియర్ నేత పవన్
MBNR: ది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర గవర్నర్ మెంబర్‌గా సీనియర్ నేత డోకూరు పవన్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఆదివారం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని, గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.