చిన్నారులకు నులిపురుగుల మాత్రలు తప్పనిసరి: కలెక్టర్

NLR: జిల్లాలో 1-19 సంవత్సరాల వయసున్న చిన్నారులందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆదేశించారు. మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా, ఆల్బెండజోల్ మాత్రలను అందజేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి చిన్నారి ఆరోగ్యాన్ని కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నారు.