పొలంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

పొలంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

కృష్ణా జిల్లాలోని వీరవల్లి-రేమల్లె రహదారి పక్కన లంకా వెంకటేశ్వరావు పొలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానిక రైతులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.