VIDEO: పగిడిద్ద రాజు గద్దెపై గజస్తంభ ప్రతిష్టాపన
MHBD: సమ్మక్క–సారలమ్మ జాతర అభివృద్ధి పనుల్లో భాగంగా మేడారంలోని తల్లుల గద్దెలపై నూతన గజస్తంభాల ప్రతిష్టాపన కొనసాగుతోంది. ఈ క్రమంలో పగిడిద్ద రాజు గద్దె కోసం ఇవాళ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పొనుగండ్ల గ్రామంలోని పగిడిద్ద రాజు దేవాలయంలో గజస్తంభాన్ని తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం గజస్తంభాన్ని మేడారానికి తరలించనున్నారు.