VIDEO: పోలీసుల ఆధ్వర్యంలో జంగిల్ క్లియరెన్స్ పనులు
AKP: నాతవరంలోని పలు కీలక రహదారులలో జంగిల్ క్లియరెన్స్ పనులను ఎస్సై తారకేశ్వరరావు శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రేవతమ్మ ఇచ్చిన సూచనల మేరకు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. దీంతో రోడ్లు విశాలంగా మారి రహదారులు స్పష్టంగా కనిపిస్తాయని, తద్వారా ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.